తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ నెల 22 నుంచి సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షలు - CBSE Exam Controller Sanyam Bhardwaj

ఈ నెల 22 నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది సీబీఎస్​ఈ. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు, శానిటైజర్​ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

CBSE class 10, 12 compartment exams to be held from Sep 22-29
ఈ నెల 22 నుంచి సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షలు

By

Published : Sep 5, 2020, 7:20 AM IST

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్‌ 22 నుంచి 29 వరకు జరగనున్నాయి. వీటితో పాటు మార్కులు మెరుగుపరచుకోవాలనుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకూ పరీక్షలు నిర్వహించనుంది సీబీఎస్​ఈ.

కొవిడ్‌-19 నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లను సొంతంగా తీసుకురావాలని సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు కరోనా పరిస్థితుల్లో సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో తీవ్ర వ్యతిరేకతను తెలియజేసింది సీబీఎస్​ఈ. విద్యార్థుల భధ్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని సురక్షిత చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది. కేసును కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details