తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​లో ఏప్రిల్​ నెలాఖరుకు కరోనా ఉగ్రరూపం!' - కరోనా ఇన్ ఇండియా

భారత్ లో కరోనా విశ్వరూపం చూపుతున్నప్పటికీ.. ఇంకా తీవ్ర దశకు చేరుకోలేదని తెలుస్తోంది. ఏప్రిల్ చివరినాటికి పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో నమోదవుతాయని ఇండియన్ ఛెస్ట్ సొసైటీ వెల్లడించింది.

corona
కరోనా

By

Published : Apr 4, 2020, 10:33 AM IST

దేశంలో కొవిడ్-19 కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిజాముద్దీన్ ఘటన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది. అయితే దేశంలో ఈ కేసులు ఇంకా తీవ్ర స్థాయికి చేరనట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఛెస్ట్ సొసైటీ(ఐసీఎస్​) కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏప్రిల్ చివరినాటికి భారత్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యంత తీవ్రమైన దశకు చేరుకుంటాయని అభిప్రాయపడింది ఐసీఎస్​.

"అమెరికాతో పోలిస్తే మనం నెల రోజులు వెనకబడి ఉన్నాం. ఏప్రిల్ చివర్లో లేదా మే తొలి వారంలో కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరుకోవచ్చు. అయితే లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఇది మరింత ఆలస్యం కూడా కావచ్చు."

-డీజే క్రిస్టోఫర్, ఇండియన్ ఛెస్ట్ సొసైటీ సారథి

ఇదీ చదవండి:కరోనాపై పోరు: మలి దశలో మరింత జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details