తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కరోనా ప్రతాపం.. ఒక్కరోజే 227 కరోనా కేసులు - దేశంలో కరోనా వైరస్​

దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. సోమవారం ఒక్కరోజే 227 మందికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 32 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. అయితే దిల్లీలో ఒక మత ప్రార్థనకు హాజరైన తెలంగాణకు చెందిన మరో ఆరుగురు వైరస్​ కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందిన 7 దేశాలతో పోలిస్తే దేశంలో కరోనా విస్తృతి తక్కువేనని చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ.

COVID-19 cases climb to 1,251; total deaths 32
దేశంలో కరోనా ప్రతాపం.. ఒక్కరోజే 227 కరోనా కేసులు

By

Published : Mar 31, 2020, 5:16 AM IST

భారత్​లో కరోనా కేసుల సంఖ్య సోమవారం భారీగా పెరిగింది. ఒక్కరోజే 227 కేసులు నమోదుకాగా.. మొత్తం ఆ సంఖ్య 1251కి చేరింది. ఒక్కరోజులోనే దేశంలో ఇంత మొత్తంలో కేసుల సంఖ్య పెరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు 32 మంది మరణించారు. మరో 101 మంది కోలుకున్నారని.. ఒకరు దేశం విడిచివెళ్లడం వల్ల ప్రస్తుతం మరో 1117 ఆక్టివ్​ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కేరళలో గరిష్ఠంగా 202 మందికి వైరస్​ సోకినట్లు ధ్రువీకరించారు అధికారులు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(198), దిల్లీ (87) ఉన్నాయి. కర్ణాటకలో 83, ఉత్తర్​ప్రదేశ్​లో 82 మంది వైరస్​ బారిన పడ్డారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 8 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు విడిచారు. గుజరాత్​లో 6, కర్ణాటక, మధ్యప్రదేశ్​లలో 3 చొప్పున, దిల్లీ, జమ్ము కశ్మీర్​లలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తెలంగాణలో ఆరుగురు చనిపోయినట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.

ఇక్కడ తక్కువే...

ప్రపంచదేశాల్లో మరణమృదంగం మోగిస్తున్న కొవిడ్‌-19 భారతదేశంలో మాత్రం సామూహిక సంక్రమణ స్థాయికి చేరలేదని.. అది స్థానిక సంక్రమణ దశలోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 100 కేసుల నుంచి వెయ్యి కేసులకు చేరుకోవడానికి 12 రోజుల వ్యవధి పట్టడాన్ని బట్టే ఈ విషయం అర్థమవుతోందని పేర్కొంది. అభివృద్ది చెందిన 7 దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా విస్తృతి తక్కువేనని చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details