లాక్‌డౌన్ నేపథ్యంలో.. విద్యార్థులకు ప్రాంగణ నియామకాల ద్వారా ఇచ్చిన ఉద్యోగావకాశాలను వెనక్కి తీసుకోవద్దంటూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆయా సంస్థల యాజమాన్యాలను కోరింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎంలలో చదివిన విద్యార్థులు కొందరు కరోనా లాక్‌డౌన్ అనిశ్చితి కారణంగా ఉద్యోగావకాశాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది.
ఐఐటీ, ఐఐఎంల్లోని ప్రాంగణ నియామకాల జాబ్స్ సేఫ్! - ఉద్యోగావకాశాలు కోల్పోయి
దేశంలోని ఐఐటీ, ఐఐఎంలలో చదివిన విద్యార్థులు కరోనా ప్రభావంతో ఉద్యోగావకాశాలు కోల్పోయిన తరుణంలో కేంద్రం స్పందించింది. ప్రాంగణ నియామకాల ద్వారా ఇచ్చిన ఉద్యోగావకాశాలను వెనక్కి తీసుకోవద్దంటూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆయా సంస్థలను కోరింది.
వారికిచ్చిన ఉద్యోగాలను వెనక్కి తీసుకోవద్దు
చదువు పూర్తయిన విద్యార్థులు క్యాంపస్ నియామకాల విషయంలో చింతించకుండా చర్యలు తీసుకుంటున్నామని అభ్యర్థులకు ఇచ్చిన అవకాశాలను వెనక్కి తీసుకోవద్దంటూ సంస్థలను అభ్యర్థించామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ తెలిపారు. విద్యార్ధులు ఇలాంటి ఉద్యోగవకాశాలు కోల్పోకుండా చూడాలని దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల డైరక్టర్లకు ఆయన ఆదేశాలు జారీచేశారు. క్యాంపస్ సెలక్షన్స్ చేపట్టిన అన్ని సంస్థలతో ఆల్ ఐఐటీస్ ప్లేస్‌మెంట్ కమిటీ ఈ మేరకు సంప్రదింపులు జరిపింది.
Last Updated : Apr 7, 2020, 6:06 PM IST