తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా బాధితురాలికి ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరికి జన్మనివ్వటం సాధారణం. ముగ్గురు లేదా నలుగురు జన్మించిన సందర్భాలు చాలా అరుదు. అలాంటిది... ఓ కరోనా బాధితురాలు ఒకే కాన్పులో నలుగురికి జన్మనివ్వటం, తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉండటం అద్భుతమే కదా. ఇలాంటి అరుదైన సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో జరిగింది.

COVID-19 affected woman delivers quadruplets
ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన కరోనా బాధిత మహిళ

By

Published : Sep 24, 2020, 8:29 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అరుదైన సంఘటన జరిగింది. ఓ కరోనా బాధిత మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని గోరఖ్​పుర్​ బీఆర్​డీ వైద్య కళాశాలలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

" నవజాత శిశువుల్లో ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారు. నాలుగో చిన్నారిని వెంటిలేటర్​పై ఉంచారు. తల్లి కూడా ఆరోగ్యంగా ఉంది. దేవరియా జిల్లాలోని గౌరీ బజార్​లో నివసిస్తున్న 26 ఏళ్ల మహిళ మంగళవారం రాత్రి వైద్య కళాశాలలోని ట్రామా సెంటర్​కు చేరుకుని కరోనా పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. అత్యంత సమర్థమైన వైద్యులు, పారామెడికల్​ బృందం వైద్యం అందించగా.. బుధవారం నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. "

- గణేశ్​ కుమార్​, బీఆర్​డీ వైద్య కళాశాల ప్రిన్సిపల్​.

అయితే... నెలలు నిండకముందే డెలివరీ అయినట్లు వైద్యులు తెలిపారు. నలుగురు చిన్నారులు 980 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదని, చాలా సవాలుతో కూడుకున్న డెలివరీగా పేర్కొన్నారు ప్రిన్సిపల్​.

నలుగురు పిల్లల నమూనాలను కరోనా పరీక్షలకు పంపించినట్లు వైద్యులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details