కరోనా సంక్షోభం దృష్ట్యా జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు ఊరట కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఈ ఏడాది నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో చేరాలంటే ఇంటర్లో 75 శాతం మార్కుల తప్పనిసరి నిబంధనను తొలగించారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇంటర్ మార్క్స్ మెమో ఉంటే చాలు..
గతంలో జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించినా.. ఇంటర్లో 75 శాతం మార్కులు లేదా మొదటి 20 పర్సంటైల్లో ఉండాలనే నిబంధన ఉండేది. ఆ నిబంధనను ఈ ఏడాది ఎత్తివేశారు. 2020లో ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులకు ఇది వర్తించనుంది. ఈమేరకు విద్యార్థులు మార్కులతో సంబంధం లేకుండా ఇంటర్ పాసైనట్లు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది.
ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ జేఈఈ మెయిన్స్‌ను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే..