తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 23 వేలు దాటిన కరోనా మరణాలు - తమిళనాడులో కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 28,701 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 500 మంది ప్రాణాలు కోల్పోయారు.

COVID-19: 735 new cases reported in Assam, tally rises to 16,806
దేశంలో మరో 28,701 కేసులు, 500 మరణాలు

By

Published : Jul 13, 2020, 9:26 AM IST

Updated : Jul 13, 2020, 11:09 AM IST

భారత్​లో కరోనా విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 28,701 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 8,78,254 మందికి కొవిడ్​ సోకిందని అధికారులు వెల్లడించారు. మరణాలు 23 వేలు దాటాయి. ఇప్పటివరకు 23,174 మంది వైరస్​కు బలయ్యారు. జులై 12 వరకు 1,18,06,256 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య వర్గాలు తెలిపాయి. ఆదివారం 2,19,103 టెస్టులు చేశారు.

దేశంలో కరోనా వివరాలు
  • మహారాష్ట్రలో కరోనా​ రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,54,427కి చేరింది. 10,289 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కేసులు 1,38,740కి చేరాయి. దాదాపు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,12,494గా ఉంది. మొత్తంగా 3,371 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 41,897 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 2,047 మంది కరోనా కారణంగా చనిపోయారు
Last Updated : Jul 13, 2020, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details