తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' విలయం- కొత్తగా 23,446 కేసులు - JK corona updates

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మహారాష్ట్రలో రికార్డ్​స్థాయిలో 23వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి. మరో 448 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో తాజాగా 9,217 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. మరో 129 మంది మృతిచెందారు. అటు దేశ రాజధాని దిల్లీలోనూ వైరస్​ మరింత తీవ్రరూపం దాల్చుతోంది.

CORONA VIRUS STATEWIDE UPDATES IN INDIA
కన్నట నాట కరోనా పంజా- కొత్తగా 9,217 మందికి వైరస్​

By

Published : Sep 10, 2020, 8:01 PM IST

Updated : Sep 10, 2020, 10:09 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. భారీస్థాయిలో కొత్త కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో కొవిడ్​ ఉగ్రరూపం కొనసాగిస్తూ తాజాగా 23,446 మందికి సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 9,90,795కు చేరింది. మహమ్మారి కారణంగా మరో 448 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 28,282కు ఎగబాకింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 7,00,715మంది వైరస్​ను జయించగా.. 2,61,432 మంది చికిత్స పొందుతున్నారు.

ఆయా రాష్ట్రాల్లో వైరస్​ విజృంభణ కొనసాగుతోందిలా..

  • కర్ణాటకలో కొత్తగా 9,217 మందికి కరోనా సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 4,30,947కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 129 మంది బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 6,937కు పెరిగింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 3,22,454 మంది వైరస్​ను జయించారు. మరో 1,01,537 యాక్టివ్​ కేసులున్నాయి.

కర్ణాటక పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రభుతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు నలుగురికి వైరస్​ సోకింది. దీంతో మంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు.

  • దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 4,308 మందికి కరోనా సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 2,05,482కు చేరింది. మరో 28 మంది మరణాలతో.. ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,666కు చేరింది. ఇప్పటివరకు 1,75,400మందికి వైరస్​ నయమవ్వగా.. 25,416 మంది ఆయా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాట కొత్తగా 5,528 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. బాధితుల సంఖ్య 4,86,052కు ఎగబాకింది. మరో 64 మంది వైరస్​తో మరణించగా.. మృతుల సంఖ్య 8,154కు చేరింది. ఇప్పటివరకు 4,29,416 మంది వైరస్​ను జయించగా.. మరో 48,482 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 7,042 మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. మరో 66 మంది వైరస్​తో మరణించగా.. చనిపోయిన వారి సంఖ్య 4,206కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,26,506 మంది కోలుకోగా.. 66,317 యాక్టివ్​ కేసులు నమోదయ్యాయి.
  • కేరళలో కొత్తగా 3,349 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 72,578 మంది వైరస్​ను జయించగా.. మరో 22,229 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • పశ్చిమ్​బంగాలో మరో 3,112 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా కేసుల సంఖ్య 1,93,175కు ఎగబాకింది. మహమ్మారి కారణంగా మరో 41 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 3,771కు పెరిగింది.
  • మధ్యప్రదేశ్​లో 2,187 కొత్త కేసులతో కలిపిం మొత్తం బాధితుల సంఖ్య 81,739కు చేరింది. ఇవాళ మరో 21 మంది వైరస్​తో చనిపోగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,661కు చేరింది.
  • జమ్ముకశ్మీర్​లో ఇవ్వాళ ఒక్కరోజే 1,592 కరోనా కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 49,134కు చేరింది. ఇప్పటివరకు అక్కడ 845 మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
  • ఉత్తరాఖండ్​లో కొత్తగా 1,015 కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 28,226కు పెరిగింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 377 కరోనా మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:'అప్పటివరకు కరోనాను తేలికగా తీసుకోవద్దు'

Last Updated : Sep 10, 2020, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details