తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 20 మంది సీఐఎస్​ఎఫ్ సిబ్బందికి కరోనా! ​ - CISF CORONA VIRUS NEWS

సీఐఎస్​ఎఫ్ సిబ్బందిలో మరో 20 మందికి కరోనా సోకింది. వీరిలో 18 మంది దిల్లీ విమానాశ్రయంలో విధులు నిర్వర్తించినట్లు అధికారులు తెలిపారు.

COVID-19: 20 fresh cases reported in CISF
కొత్తగా 20 మంది సీఐఎస్​ఎఫ్ సిబ్బందికి కరోనా! ​

By

Published : May 26, 2020, 4:22 PM IST

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందిలో మరో 20 మందికి కరోనా సోకింది. వీరిలో 18 మంది దిల్లీ విమానాశ్రయంలో భద్రత సేవలు అందించారని అధికారులు తెలిపారు. వారందరినీ క్వారంటైన్​లో ఉంచినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం దిల్లీ విమానాశ్రయంలో విధులు నిర్వహించిన మెత్తం 25 మంది సిబ్బంది కరోనాకు చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం మరో 10 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సీఐఎస్​ఎఫ్​లో మహమ్మారి కారణంగా ముగ్గురు మరణించినట్లు వెల్లడించారు.

సుమారు 1.62 లక్షల మంది సిబ్బంది ఉన్న సీఐఎస్​ఎఫ్​లో.. ప్రస్తుతం 78 యాక్టీవ్​ కేసులు ఉన్నాయి. మరో 132 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.​ న్యూక్లియర్​, ఎరోస్పేస్​ డొమైన్​లలో కీలకమైన రక్షణ సేవలు అందిస్తుంది సీఐఎస్​ఎఫ్​. ప్రస్తుతం 63 విమానాశ్రయాలకు సీఐఎస్​ఎఫ్​ భద్రత ఇస్తుంది.

ABOUT THE AUTHOR

...view details