తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హమ్మయ్య.. ఆ 16 మంది పిజ్జా బాయ్స్​కు కరోనా నెగిటివ్​

దిల్లీలో కరోనా సోకిన పిజ్జా డెలివరీ బాయ్​ సన్నిహితులు.. వైరస్​ బారి నుంచి తప్పించుకున్నారు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వారికి కరోనా నెగిటివ్​ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అతడు సర్వీస్​ అందించిన దాదాపు 72 కుటుంబాలకు ఈ మహమ్మారి అంటుకుందని తొలుత భయపడినా.. ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదని వైద్యుల ధ్రువీకరించారు.

COVID-19: 16 high-risk contacts of infected Delhi pizza delivery agent test negative
హమ్మయ్య.. ఆ పిజ్జా బాయ్​కి కరోనా సోకలేదు

By

Published : Apr 20, 2020, 4:42 PM IST

దేశ రాజధానిలో 19 సంవత్సరాల పిజ్జా డెలివరీ బాయ్‌కు.. కరోనా పాజిటివ్‌ అని నిర్ధరణ కావటం ఇటీవల కలకలం రేపింది. ఆ యువకుడు ఆహారాన్ని అందించేందుకు వెళ్లిన కుటుంబాలనూ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. తాజాగా ఆ కుర్రాడితో సన్నిహితంగా మెలిగిన మరో 16 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో వైరస్​ లక్షణాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు.

ఇదీ జరిగింది..

బాధిత యువకుడు దక్షిణ దిల్లీలోని మాలవీయనగర్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో పనిచేసేవాడు. ఏప్రిల్​ 12 వరకు అతడు విధుల్లోనే ఉన్నాడు. అతడు విధుల్లో ఉన్న ఆఖరి 15 రోజుల్లో హౌజ్‌ ఖాస్‌, మాలవీయ నగర్‌, సావిత్రి నగర్‌ తదితర ప్రాంతాల్లో 72 కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేశాడు. తర్వాత ఆ యువకుడు అనారోగ్యానికి గురికావడం వల్ల అతడిని ఆర్‌ఎంఎల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే ఏప్రిల్​ 14న అతడికి కొవిడ్‌-19 ఉన్నట్లు తెలియగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. అతడితో సహా అతడి నుంచి పిజ్జాలు డెలవరీ తీసుకున్న కుటుంబాలన్నిటినీ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. యువకుడితో కలసి పనిచేసిన మరో 16 మంది డెలివరీ ఉద్యోగులను కూడా క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. అయితే వారందరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదని వైద్యులు ధ్రువీకరించారు. అతడికి మాత్రం చికిత్స అందిస్తున్నారు.

దిల్లీలో ఇప్పటి వరకు 2,003 మందికి కరోనా సోకగా, మరణాల సంఖ్య 45గా ఉంది. మొత్తం 72 మంది కోలుకున్నారు.

ఇదీ చదవండి...

తండ్రి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి దూరం

ABOUT THE AUTHOR

...view details