తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే బెటాలియన్​లో 122 మంది జవాన్లకు కరోనా - corona in crpf bettalion news

కరోనా మహమ్మారి బారిన పడుతున్న సీఆర్​పీఎఫ్​ జవాన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 68 మంది సైనికులకు పాజిటివ్​గా తేలగా.. మొత్తం కేసుల సంఖ్య 127కు చేరినట్లు అధికారులు తెలిపారు. అయితే.. అందులో 122 మంది తూర్పు దిల్లీలోని బెటాలియన్​కు చెందిన వారే ఉన్నట్లు వెల్లడించారు.

COVID
ఒకే బెటాలియన్​లో 122 మంది జవాన్లకు కరోనా పాజిటివ్

By

Published : May 2, 2020, 12:17 PM IST

క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతోన్న సీఆర్​పీఎఫ్​ జ‌వాన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తూర్పు దిల్లీ మయూర్​ విహార్​-3 ప్రాంతంలోని సీఆర్​పీఎఫ్​ బెటాలియ‌న్‌కు చెందిన‌ జ‌వాన్లు వ‌రుస‌గా వైరస్‌ బారినప‌డుతున్నారు. తాజాగా మ‌రో 68మంది జ‌వాన్లకు పాజిటివ్‌ అని తేలినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు ఆ బెటాలియన్​కు చెందిన 122 మందికి వైరస్​ సోకడంపై ఆందోళన వ్యక్తంచేశారు.

ఇప్పటి వరకు సీఆర్​పీఎఫ్​లో మొత్తం 127 మందికి కరోనా సోకినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఒకరు మరణించగా, మరొకరు కోలుకున్నట్లు వెల్లడించారు. మరో 100 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు.

" బాధిత జవాన్లను దిల్లీలోని మండోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం. శుక్రవారం రోజున 12 మందికి పాజిటివ్​​గా తేలగా.. ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​ ప్రాణాలు కోల్పోయాడు. ఒకే బెటాలియన్​​లో ఇంత భారీ సంఖ్యలో వైరస్​ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్​కు తరలిస్తున్నాం. ఈ బెటాలియన్​లో కరోనా వ్యాప్తికి నర్సింగ్​ విభాగంలో పని చేసే ఓ కానిస్టేబుల్​ కారణంగా వైరస్ సోకిందని భావిస్తున్నాం."

- సీఆర్​పీఎఫ్​ అధికారి.

ముగ్గురు ఎస్​ఆర్​పీఎఫ్​ జవాన్లకూ కరోనా..

మహారాష్ట్ర జల్నా ప్రాంతంలో ఈరోజు ఐదుగురికి కరోనా పాజిటివ్​గా తేలగా.. అందులో ముగ్గురు ఎస్​ఆర్​పీఎఫ్​ జవాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జల్నా ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఇద్దరు కోలుకోగా.. మిగతా వారు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details