తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి

covaxin
కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి

By

Published : Jan 3, 2021, 11:12 AM IST

Updated : Jan 3, 2021, 12:02 PM IST

11:11 January 03

కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి

కొవిడ్‌ నిరోధానికి దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వ్యాక్సిన్‌కు అనుమతినిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ టీకా భద్రమైనదని ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. అలాగే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది. కరోనా వైరస్‌ రూపాంతరం చెంది, కొత్త రకాలు విజృంభిస్తున్న తరుణంలో డీసీజీఐ నుంచి ఈ ప్రకటన రావడం ఊరట కల్పించే అంశం.

అంతకుముందు ఈ రెండు టీకాలకు అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) సిఫార్సు చేసింది. దానికనుగుణంగా నేడు డీసీజీఐ తుది అనుమతులను జారీ చేసింది. టీకా ఉత్పత్తి, పంపిణీ అంశాలపై ఇప్పటికే దృష్టి సారించినట్లు భారత్‌ బయోటెక్‌ ఇటీవల వెల్లడించింది. 

Last Updated : Jan 3, 2021, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details