కరోనా వైరస్‌కు 'కొవాగ్జిన్' టీకా రూపొందిస్తున్న భారత్ బయోటెక్ సంస్థకు మరో అనుమతి లభించింది. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిబంధనల్లో మార్పు చేసేందుకు ప్రభుత్వ ప్యానెల్ అంగీకరించిందని తెలిసింది. చర్మం కింది పొరలో టీకా ఇచ్చే ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతి ఇచ్చిందని సమాచారం.
సాధారణంగా చికిత్స చేసేందుకు టీకాను అనేక మార్గాలు ఇస్తారు. ఎక్కువగా కండరాలకు ఇస్తారు. భుజాలు, పిరుదులకు టీకా ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. దీనిని ఇంట్రామస్కులర్ రూట్ అంటారు. కొన్ని టీకాలను సెలైన్, నోరు, నరాల ద్వారా ఇస్తారు. అలాగే కొన్నింటికి చర్మం కింద వున్న పొరకు ఇస్తారు. దీనినే 'ఇంట్రాడెర్మల్ రూట్' అంటారు. రెండు షరతులకు లోబడి కొవాగ్జిన్‌తో ఇలా ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతులు లభించాయని వార్తలు వస్తున్నాయి.