భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళకు బెయిల్ రద్దుపై విచారణను దిల్లీ కోర్టు వాయిదా వేసింది. దిల్లీ పోలీసుల విజ్ఞప్తిపై మే 23న విచారణ చేపడతామని తెలిపింది.
మోసం కేసు...

సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళపై... గతంలో మోసం కేసు నమోదైంది. హరియాణాకు చెందిన నవీన్ కుమార్ తిలక్మార్గ్లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె తనకు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50 వేలు లంచం తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. మార్చి 3న మోసం, బెదిరింపు, నేరపూరిత కుట్ర కేసులను పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్పై ఉన్నారు.
ఆమె ఫిర్యాదుదారుడ్ని బెదిరిస్తున్నారని, బెయిల్ రద్దు చేయాలని దిల్లీ పోలీసులు కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ నకలు ఇంకా ఆమెకు అందలేదనే కారణంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ చూడండి :'విపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదు'