దేశంలో కలకలం పుట్టించిన పాల్ఘడ్ కేసులోని 53 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది మహారాష్ట్రలోని ఠానే ప్రత్యేక న్యాయస్థానం. ఒక్కొక్కరు రూ.15వేలు పూచీకత్తు కోర్టుకు సమర్పించాలని జిల్లా జడ్జి జేజే జాదవ్ ఆదేశించారు.
సాధువుల హత్య కేసులో 53 మందికి బెయిల్ - palghar incident
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పాల్ఘడ్ మూక దాడి కేసులో 53మందికి మహారాష్ట్రలోని ఠానే ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
సాధవుల హత్య కేసులో నిందితులకు బెయిల్
ఏప్రిల్ 16న ఠానే జిల్లాలోని గాడ్చిన్చాలే వద్ద ఇద్దరు సాధువులను ప్రజలు కొట్టి చంపారు. మొత్తం 201 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా... ఇప్పటివరకు 57 మందికి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.