ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు కుల్దీప్ సెంగార్‌కు దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. భాజపా బహిష్కృత ఎమ్మెల్యేతో పాటు అతడి అనుచరులపైనా అభియోగాల నమోదుకు న్యాయస్థానం ఆదేశించింది.
2017నాటి కేసులో సీబీఐ తాజాగా సమర్పించిన వివరాల ఆధారంగా దిల్లీ జిల్లా కోర్టు జడ్జి ధర్మేశ్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరపూరిత కుట్ర, అపహరణ, వివాహం కోసం ఓ మహిళను బలవంతం చేయడం, అత్యాచారం సహా పోక్సో(లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద కుల్దీప్, అతడి అనుచరుడు శశి సింగ్‌పై అభియోగాలు మోపాలని సీబీఐకి సూచించారు.
అక్రమంగా ఎఫ్ఐఆర్!