ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ వాద్రాకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేశారు.
నగదుబదిలీ కేసులో వాద్రాకు ఊరట
రాబర్ట్ వాద్రా ముందస్తు బెయిల్ గడువును ఈ నెల 25 వరకు పొడగిస్తూ దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అక్రమ నగదు బదిలీ కేసులో నిర్బంధ విచారణ అవసరమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
రాబర్ట్ వాద్రా
లండన్‌లో రూ.17.34 కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వాద్రాపై కేసు నమోదు చేసింది ఈడీ. గత నెల 16న అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
వాద్రాకు చెందిన మరిన్ని ఆస్తుల వివరాలు సేకరించినట్లు ఈడీ పేర్కొంది. అందులో రూ.82.23 కోట్ల విలువైన రెండు ఇళ్లు, మరో ఆరు ప్లాట్లు, ఇతర ఆస్తులు ఉన్నట్లు తెలిపింది.
Last Updated : Mar 19, 2019, 9:06 PM IST