ఉత్తర్ప్రదేశ్లో అత్యాచార నిందితులపై కఠినంగా వ్యవహరిస్తోంది పోక్సో న్యాయస్థానం. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కేసులో.. జీవిత ఖైదు విధించారు ప్రత్యేక న్యాయమూర్తి వీణా నారాయణ్. అంతేకాకుండా దోషికి రూ. 2లక్షలు జరిమానా కట్టాలని కూడా తీర్పునిచ్చారు. ఈ మేరకు శిక్షను ధ్రువీకరిస్తూ.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరేంద్ర త్యాగి ఆరోపణలు చేసిన 22 రోజుల్లోనే తీర్పు ఖరారు కావడం గమనార్హం.
ఏమైందంటే.?
అమ్రోహ జిల్లాలో ఆగస్టు 6న.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చాడు దళపత్ అనే నిందితుడు. ఈ కేసులో అదే నెల 14న నిందుతుణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.