11 ఏళ్ల బాలుడనే కనికరం కూడా లేకుండా అపహరించి అతి కిరాతకంగా హత్య చేసిన ఓ నేరస్థుడికి ఉరి శిక్ష విధించింది దిల్లీలోని న్యాయస్థానం. ఇలాంటి క్రూరమైన చర్యకు పాల్పడిన వారికి మరణ దండన తప్ప ప్రత్యామ్నాయం లేదని అదనపు సెషన్సు జడ్జి శివాజీ ఆనంద్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి కిరాతకులకు ఉరే సరి: దిల్లీ కోర్టు - rarest of rare case delhi boy murder case
11ఏళ్ల బాలుణ్ని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో నేరస్థుడికి ఉరిశిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఇలాంటి క్రూరులకు ఉరి శిక్షే సరైందని అదనపు సెషన్సు జడ్జి వ్యాఖ్యానించారు.
ఇలాంటి కిరాతకులకు ఉరే సరి: దిల్లీ కోర్టు
2009 మార్చి 18న జీవక్ నాగ్పాల్ అనే వ్యక్తి దిల్లీలోని రోహిణిలో తన పొరుగు ఇంట్లోని బాలుడ్ని డబ్బుకోసం కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. తీర్పు అనంతరం ఈ కేసు అత్యంత అరుదైందని జడ్జి అన్నారు.