దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌కు ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనుంది దిల్లీ జిల్లా కోర్టు. సెంగార్‌కు శిక్ష విధింపుపై ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. కులదీప్‌కు జీవిత ఖైదు విధించాలని సీబీఐ వాదనలు వినిపించింది. న్యాయం కోసం వ్యవస్థపై ఒక వ్యక్తి చేసిన పోరాటం కనుక ఈ కేసులో కులదీప్‌కు గరిష్ఠ శిక్ష అయిన జీవిత ఖైదు విధించాలని కోరింది. అత్యాచార బాధితురాలికి సరైన పరిహారం చెల్లించాలంది.
ఈ నేపథ్యంలో కులదీప్ సెంగార్ ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకు ఎన్నికల నామినేషన్ పత్రాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలికి పరిహారం చెల్లింపునకు సెంగార్ ఆర్థిక పరిస్థితిని న్యాయస్థానం పరిశీలించనుంది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.