నిత్య జీవితంలో నడక ద్వారా మన పనులు సాగిస్తుంటాం. అయితే కూర్చుని చేసే ఉద్యోగాల్లోనూ కాసేపు నిల్చోవాలని.. అటు ఇటు తిరగాలని వైద్యనిపుణులు సూచిస్తూనే ఉన్నారు. సుదీర్ఘ ప్రయాణాల్లో కూర్చుని ప్రయాణించడం అంటేనే నరకం కదూ.. ఎప్పుడూ కూర్చోనే ఉండాలంటే.. చాలా కష్టం కదూ. మరి లేచి నడవలేని దివ్యాంగుల పరిస్థితి ఊహించుకోండి.. ఎంతో ఇబ్బంది. కదలలేని కాళ్లకు తోడు.. ఎప్పుడూ కూర్చునే ఉండటం వల్ల వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చింది ఐఐటీ మద్రాస్.
ఫీనిక్స్ మెడికల్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో దివ్యాంగులు నిల్చునేందుకు వీలుగా వీల్ చెయిర్ను తయారుచేసి అందరి మన్ననలు పొందుతున్నారు ఐఐటీ మద్రాస్ విద్యార్థులు. ఇలాంటి వీల్ చెయిర్ తయారుచేయడం దేశంలో ఇదే మొట్టమొదటిసారి.
అరైస్గా నామకరణం చేసిన ఈ వీల్ చెయిర్ కేంద్రమంత్రి థావర్ చంద్ గహ్లోత్ చేతులమీదుగా విడుదలైంది. ఈ వీల్చెయిర్పై నిల్చునే ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లొచ్చు.