దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించకపోతే విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ పక్కదారి పడితే లక్షలాది కుటుంబాల జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని అన్నారు.
"భారత దేశ ఆర్థిక వ్యవస్థ దుర్నిర్వహణ ఓ విషాదం. దీని ప్రభావం లక్షలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇకపై ఈ పరిస్థితిని చూస్తూ సహించేది లేదు. " అని పేర్కొన్నారు.