నీతి నియమాలున్న వారే ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలన్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై లఖ్‌నవూ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. భాజపా ప్రభుత్వం మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. ఈ కారణంగానే మోదీకి ఆర్ఎస్ఎస్ సహకరించడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం కారణంగా మోదీపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు మాయావతి.
భాజపా సర్కార్ మునుగుతున్న నావ: మాయ - లఖ్‌నవూ
ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. దేశానికి 'చాయ్‌వాలా, చౌకీదార్' ప్రధాని అవసరం లేదని, నీతి నియమాలున్న వారే ఆ పదవిని చేపట్టాలని లఖ్‌నవూ వేదికగా ఉద్ఘాటించారు.
దేశానికి నీతిమంతమైన ప్రధాని కావాలి: మాయావతి
" ప్రజా వ్యతిరేకతను చూసి భాజపా ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. దీనివల్ల మోదీకి చెమటలు పడుతున్నాయి. దేశం ఇప్పటివరకు సేవకుడు, ప్రధాన సేవకుడు, చాయ్‌వాలా, కాపలాదారు వంటి నేతలను చూసింది. దేశానికి ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే, నీతి నియమాలు పాటించే ప్రధాని కావాలి."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి