చంద్రయాన్-2 ప్రయోగంలో సమస్య నేపథ్యంలో పలువురు ప్రముఖులు శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు కోసం వారి కృషి, అంకితభావాన్ని కొనియాడారు. విక్రమ్‌ను కోల్పోయినంతమాత్రాన నిరాశ చెందొద్దని భరోసా కల్పించారు.
శాస్త్రవేత్తలకు అండగా దేశం..
చంద్రయాన్-2 ప్రయోగంలో ఇస్రో సాధించిన విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్ షా. శాస్త్రవేత్తలకు దేశం మొత్తం అండగా ఉందన్నారు. భవిష్యత్తు ప్రయోగాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
అపజయంతో ముగిసిపోదు...