తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారికి చప్పట్లు కాదు.. రక్షణ కావాలి' - Country should have taken coronavirus threat more seriously: Cong

కరోనా​ను నియంత్రించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో వైద్యులకు రక్షణ పరికరాల కొరత ఉందని పేర్కొంది. వైద్య సిబ్బందికి పరికరాలు అందించే విషయంలో ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని ఆరోపించింది.

randeep surjewala congress coronavirus
కరోనా కాంగ్రెస్ సుర్జేవాలా

By

Published : Mar 24, 2020, 7:26 PM IST

కరోనా వైరస్​ను నియంత్రించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది కాంగ్రెస్​. ప్రభుత్వ తీరును ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కరోనా ముప్పును తీవ్రంగా పరిగణించి, మరింత ఉత్తమంగా సిద్ధం కావాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. మాస్కులు అందించాలని ట్విట్టర్​ ద్వారా ప్రధానిని అభ్యర్థించిన ఓ వైద్యుడి ట్వీట్​కు బదులుగా స్పందించారు రాహుల్.

"చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇవి పూర్తిగా నివారించదగిన పరిస్థితులు(మాస్కుల కొరతనుద్దేశించి). మనం సిద్ధం కావడానికి సమయం లభించింది. ఈ ముప్పును మరింత తీవ్రంగా పరిగణించి సంసిద్ధంగా ఉండాల్సింది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా సైతం ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. వైరస్ బాధితులకు చికిత్సనందించే వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణార్థం ప్రభుత్వం సరైన పరికరాలు అందించలేదని ఆరోపించారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2 మధ్య సిబ్బందికి ఈ పరికరాలు ఇవ్వడంలో కేంద్రం నేరపూరితంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు.

రణ్​దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు.. కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, వైద్య నిపుణుల సేవలను అభినందిస్తూ మార్చి 22 సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాం. అయితే వారికి కావాల్సింది చప్పట్లు కాదు. రక్షణ కావాలి. వారు కోరుకుంటున్నది కూడా అదే. ఐదు రోజుల క్రితం(మార్చి 19 నాటికి) వరకు భారత్​లో అందుబాటులో ఉన్న పరికరాలు, వెంటిలేటర్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వాణిజ్య శాఖ అనుమతి ఇచ్చింది. మీ మంత్రులే ఈ నేరపూరిత చర్యలకు పాల్పడ్డారు."-రణ్​దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి

భారత్​కు ఇప్పుడు 7 లక్షల హెజ్మత్​ సూట్లు, 60 లక్షల ఎన్​-95 మాస్కులు, కోటి 'మూడు లేయర్ల మాస్కులు' అత్యవసరమని సుర్జేవాలా అన్నారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్- వీడియో కాన్ఫరెన్స్​లోనే పెళ్లి

ABOUT THE AUTHOR

...view details