తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​లో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు' - సాధారణం కంటే అధిక వర్షపాతం

దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్​ 1 నుంచి సెప్టెంబర్​ 30 మధ్య కాలంలో సగటున 109 శాతం వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. 19 రాష్ట్రాల్లో సాధారణం, 9 రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదు అయింది.

Country received 'above normal' rainfall during 4-month monsoon: IMD
'భారత్​లో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు'

By

Published : Sep 30, 2020, 7:58 PM IST

Updated : Sep 30, 2020, 8:34 PM IST

దేశంలో ఈ ఏడాది నాలుగు నెలల వర్షాకాలంలో.. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సగటు వర్షపాతం 109 శాతంగా ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. జూన్​ (107 శాతం), ఆగస్టు (127 శాతం), సెప్టెంబర్​ (105 శాతం)లలో సాధారణ కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కాగా.. జులైలో లోటు వర్షపాతం కంటే తక్కువగా 90 శాతం మాత్రమే వర్షాలు కురిశాయి.

వర్షకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్​పీఏ) 96 నుంచి 104 శాతంగా ఉంటే దానిని సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు.

" 1961-2010 డేటా ఆధారంగా లెక్కించిన దీర్ఘకాల సగటు 87.7 సెంటీమీటర్లు. అయితే ఈ ఏడాది జూన్​ 1 నుంచి సెప్టెంబర్​ 30 వరకు 95.4 సెంటీమీటర్ల మేర (109 శాతం) ఎక్కువ వర్షపాతం నమోదైంది. 1990 నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే.. 1994, 2019 వరుస సంవత్సరాల్లో మాత్రమే దీర్ఘకాల సగటు 110 శాతంగా నమోదైంది. ఈ సంవత్సరాల్లో ఎల్​పీఏకు 9 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది."

- ఆర్​కే జెనమాని, ఎన్​డబ్ల్యూఎఫ్​సీ శాస్త్రవేత్త.

భారత్​లో వర్షాకాలం అధికారికంగా జూన్​ 1న ప్రారంభమై సెప్టెంబర్​ 30తో ముగుస్తుంది. ఈశాన్య రుతుపవనాలు దేశీయ వార్షిక వర్షపాతంలో 70 శాతం నమోదు చేస్తాయి. ఈ రుతుపవనాలు వ్యవసాయానికి చాలా కీలకం. ఈసారి కురిసిన వర్షాలతో ఖరీఫ్​లో సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది 1,066.06 లక్షల హెక్టార్లలో పంట సాగు కాగా.. ఈ ఏడాది అది 1,116.88 లక్షల హెక్టార్లుగా ఉంది.

  • ఐఎండీకి నాలుగు డివిజన్లు ఉన్నాయి. తూర్పు, ఈశాన్య భారత్​, సెంట్రల్​ ఇండియా, దక్షిణ భారత్​లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయింది. వాయువ్య భారత్​ డివిజన్​లో లోటు కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయింది.
  • 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధిక వర్షపాతం కురిసింది. అందులో బిహార్​, గుజరాత్​, మేఘాలయ, గోవా, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, తమిళనాడులు ఉన్నాయి. కర్ణాటక, లక్షద్వీప్​లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవగా.. సిక్కింలో అత్యధికంగా వర్షాలు పడ్డాయి.
  • నాగాలాండ్​, మణిపుర్​, మీజోరాం, త్రిపుర, ఉత్తరాఖండ్​, హిమాచల్​ప్రదేశ్​, జమ్ముకశ్మీర్​లలో లోటు వర్షపాతం నమోదైంది. అందులో లద్దాఖ్​లో తీవ్రలోటు ఏర్పడింది.
  • జూన్​ 1న రుతుపవనాలు కేరళను తాకాయి. వాటికి నిసర్గ తుపాను బలం చేకూర్చింది. అవి 12 రోజుల ముందుగానే జూన్​ 26 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాయి. సాధారణ తేదీ కన్నా 11 రోజుల ఆలస్యంగా రుతుపవనాలు వైదొలిగాయి. ఆగస్టులో ఐదు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అది కేంద్ర భారత్​లో అత్యధిక వర్షపాతానికి దారితీసింది.

ఇదీ చూడండి: 2 రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం

Last Updated : Sep 30, 2020, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details