తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్​స్టెక్​ నేతలు

ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిమ్​స్టెక్​ దేశాలతో పాటు మారిషస్, కిరిగిస్థాన్​ అధినేతలు​ హాజరవుతున్నారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు, మాజీ ప్రధానులనూ ఆహ్వానించారు.

మోదీ

By

Published : May 29, 2019, 6:05 AM IST

Updated : May 29, 2019, 7:28 AM IST

మోదీ కోసం బిమ్​స్టెక్​ నేతలు

ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పలు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. మే 30న జరిగే ఈ కార్యక్రమానికి బిమ్​స్టెక్​ దేశాలతో పాటు మారిషస్​, కిరిగిస్థాన్​ అధినేతలు హాజరు కానున్నట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టం చేశారు.

"మోదీ ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి హాజరవుతున్నామని ప్రకటించారు. వీరితో పాటుగా మయన్మార్​ అధ్యక్షుడు యూ విన్​ మైయింట్​, భూటాన్​ ప్రధాని లొటాయ్ షెరింగ్ వస్తున్నారు. మారిషస్​ ప్రధాని జుగ్​నాథ్​, థాయిలాండ్​ ప్రత్యేక దౌత్య ప్రతినిధి గ్రిసాడా బూన్రాక్​ హాజరవుతారు. వీరికి ఆతిథ్యం ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. "

-రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

బిమ్​స్టెక్​ దేశాల్లో భారత్​, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్​ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. 2014లో మోదీ పదవిని స్వీకరించేటప్పుడు సార్క్​ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అందులో పాకిస్థాన్​ అప్పటి ప్రధాని నవాజ్​ షరీఫ్​ కూడా ఉన్నారు.

విపక్షాలకూ ఆహ్వానం

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి విపక్ష నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మాజీ ప్రధానులను ఆహ్వానించారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బంగాల్ సీఎం మమత బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఉన్నారు.

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. గురువారం సాయంత్రం 7 గంటలకు మోదీతో పాటు నూతన మంత్రి మండలి సభ్యులూ ప్రమాణం చేయనున్నారు.

ఇదీ చూడండి:భాజపా గూటికి తృణమూల్ కాంగ్రెస్​​ ఎమ్మెల్యేలు

Last Updated : May 29, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details