తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా దుష్ప్రచారాల కట్టడి అత్యంత ఆవశ్యకం' - 'కరోనా పై మోదీ

కరోనాపై విసృతంగా ప్రచారమవుతున్న ముఢనమ్మకాలు, అసత్యవార్తలను అరికట్టడంలో సామాజిక సేవా సంస్థలు కీలకపాత్ర పోషించొచ్చన్నారు ప్రధానమంత్రి మోదీ. వైరస్​పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

Counter misinformation, superstition on coronavirus: PM to social workers
'కరోనా దుష్ర్పచారాలపై సామాజిక సంస్థలు అరికట్టవచ్చు'

By

Published : Mar 30, 2020, 7:42 PM IST

కరోనాపై ప్రచారమయ్యే దుష్ప్రచారాలు, మూఢనమ్మకాలను అరికట్టడంలో సామాజిక సేవా సంస్థలు కీలక పాత్ర పోషించొచ్చన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మూఢనమ్మకాల పేరిట ప్రజలు గుమిగూడుతూ.. కరోనాను కట్టడి చేయడంలో సామాజిక దూరం ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారని మోదీ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావల్సిన అవసరముందని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సందేశమిచ్చారు.

"పేద ప్రజలకు కనీస సౌకర్యాలు, రోగులకు సేవ అందించడంలో వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషించొచ్చు. ప్రస్తుతం దేశం ఇంతకుముందెన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుంది, దేశానికి సామాజిక సంస్థల సేవ అవసరముంది. పేదలకు సేవచేయడమే.. దేశానికి సేవ చేయడానికి ఉత్తమమైన మార్గమని మహాత్మగాంధీ చెప్పేవారు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి : కరోనా గురించి మీరు విన్న వాటిలో ఏది నిజం?

ABOUT THE AUTHOR

...view details