గుజరాత్లో 8 నెలలుగా ఓ మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. మృతుడి కుటుంబ సభ్యులే శవాన్ని వేలాడదీశారు. తమ బంధువును ఎవరో హత్య చేశారని... న్యాయం జరిగేంత వరకు మృతదేహం చెట్టుకే ఉంటుందని తేల్చిచెబుతున్నారు.
ప్రేమించడమే కారణమా?
సాబర్కాంఠా జిల్లాలోని టధివేది గ్రామంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చెట్టుకు వేలాడదీశారు. ఓ అమ్మాయిని తమ బంధువు ప్రేమించాడని, వారి ప్రేమను వ్యతిరేకించిన అమ్మాయి తరఫు కుంటుంబ సభ్యులు అతణ్ని హతమార్చారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు శవాన్ని చెట్టు నుంచి దించమని స్పష్టం చేశారు. 8 నెలలుగా ఆ మృతదేహం చెట్టుకే వేలాడుతోంది.
వర్షాకాలంలో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చే అవకాశముందని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.