కర్ణాటక మంగళూరులోని ఓ డ్రైనేజీకి స్వయంగా మరమ్మతులు చేసి స్థానికుల మన్ననలు పొందారు అక్కడి కార్పొరేటర్ కాద్రీ మనోహర్ శెట్టి.
కొద్దికాలంగా నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. ఫలితంగా కాద్రీ కంబళ రోడ్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఏటా వర్షా కాలంలో ఇలానే జరుగుతోందని అక్కడి ప్రజలు కార్పొరేటర్ మనోహర్‌కు మొరపెట్టుకున్నారు.
కూలీలు నిరాకరించినా..
తక్షణమే డ్రైనేజ్ వ్యవస్థను బాగుచేయించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారా కార్పొరేటర్. కానీ ఆ మురికిగుంటలోకి దిగేందుకు కూలీలు సాహసించలేదు. ఫలితంగా కాద్రీయే స్వయంగా రంగంలోకి దిగారు. మరో నలుగురు కూలీల సాయంతో డ్రైనేజ్ వ్యవస్థను బాగుచేశారు.
డ్రైనైజ్లోకి దిగుతున్న కార్పొరేటర్ ఇదీ చదవండి:21 అడుగుల పద్యంతో ప్రపంచ రికార్డు