భారత్లో మరో ఆరుగురికి కరోనా వైరస్ లక్షణాలు అధికంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరందరినీ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గుర్తించినట్టు స్పష్టం చేసింది.
దిల్లీ నుంచి ఆగ్రాకు...
ఇద్దరు భారతీయులకు వైరస్ సోకినట్టు సోమవారం నిర్ధరణ అయ్యింది. వీరిలో 45ఏళ్ల దిల్లీవాసి ఒకరు. ఆయన ఇటీవలే ఆగ్రాను సందర్శించారు. ఆ వ్యక్తి బంధువులే ఈ ఆరుగురు ఆగ్రావాసులు. ప్రస్తుతం వీరిని అధికారులు నిర్బంధించారు. దిల్లీలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో ఈ ఆరుగురిని కలిసిన వారి కోసం 'ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్'(ఐడీఎస్పీ) సహాయంతో అన్వేషిస్తున్నారు అధికారులు .
కరోనా బారినపడ్డ దిల్లీవాసిని సఫ్దార్జంగ్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను నిత్యం అప్రమత్తంగా ఉండమని సూచించారు అధికారులు. బాధితుడి కుమార్తె చదివే పాఠశాల సహా మరో విద్యాసంస్థకు సెలవులు ఇచ్చారు.
ఆగ్రాలో సర్వం అప్రమత్తం...
కరోనాను గుర్తించేందుకు ఆగ్రాలో విస్త్రతంగా పరీక్షలు జరుగుతున్నాయి. ఇటలీ, చైనా, ఇరాన్ నుంచి వచ్చిన సందర్శకులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం కోసం హోటళ్లు, పర్యటక కేంద్రాల నుంచి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. జైపుర్లోని ఓ ఇటలీవాసికి వైరస్ సోకినట్టు నిర్ధరణ కావడం వల్ల ఈ చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల కోసం వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచారు.
నూతన మార్గదర్శకాలు..