'నిర్లక్ష్యం... మాస్కులు వేసుకోమంటే నిర్లక్ష్యం. చేతులు కడుక్కోమంటే నిర్లక్ష్యం. కనీసం తుమ్మినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోమంటే నిర్లక్ష్యం. ఇలా కరోనా జాగ్రత్తలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరిగితే.. మా ఆరోగ్యాలు ఏం కావాలి?' అంటూ... మాస్క్ లేకుండా తుమ్మిన ఓ వ్యక్తి తాటతీశారు మహారాష్ట్రకు చెందిన దంపతులు.
ఓ వైపు కరోనా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇలాంటి సమయంలో కొల్హాపుర్లోని గుజారీలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి కరోనా జాగ్రత్తలను పెడచెవినపెట్టాడు. ముఖానికి మాస్క్లేకుండా, కనీసం చేతులు అడ్డుపెట్టుకోకుండా నడిరోడ్డుపై తుమ్మాడు.