యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఆరోగ్యపరంగానే గాక.. ఆర్థికంగానూ పెను భారంగా మారింది. మహమ్మారి సోకకుండా ఉండేందుకు మాస్క్‌లు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో వాటికి డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదునుగా భావించిన మహారాష్ట్ర పుణెలోని ఓ మందుల దుకాణంలో పనిచేస్తున్న ఫార్మాసిస్టు మాస్క్‌లు, ఇతర మందులను అపహరించాడు.
మహారాష్ట్రలో మాస్క్‌ల అపహరణ.. నిందితుడు ఫార్మాసిస్టే! - మహారాష్ట్రలో మాస్క్‌ల అపహరణ
కరోనా వైరస్ ప్రభావం మాస్క్‌లపై పడింది. వాటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర పుణెలో ఓ ఫార్మాసిస్టు మాస్క్‌లు, మందులు అపహరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలో మాస్క్‌ల అపహరణ.. నిందితుడు ఫార్మసిస్టే!
నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి మాస్క్‌లు, ఇంజక్షన్లు, మందులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:కేరళ చిన్నారికి కరోనా- 42కు చేరిన బాధితులు