తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 5:20 AM IST

ETV Bharat / bharat

ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్‌లకు ఒకే ధర కోసం సుప్రీంలో పిల్​

కరోనా నిర్ధరణ కోసం చేసే ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల ధర దేశంలో ఒక్కోచోట ఒక్కోలా ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండేలా చూడాలని సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పరీక్ష కోసం రూ.900 నుంచి రూ.2800 వరకు వసూలు చేస్తున్నట్లు పిటిషనర్​ పేర్కొన్నారు. కరోనా విపత్తును అవకాశంగా వాడుకొని కోట్లకు కోట్లు దండుకుంటున్నట్లు తెలిపారు.

RT-PCR test
ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్‌లకు ఒకే ధర కోసం సుప్రీంలో పిల్​

కరోనా నిర్ధరణకు చేసే ఆర్​టీ-పీసీఆర్‌ టెస్టులకు దేశమంతా ఒకే ధర ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఒక్కో పరీక్షకు దేశమంతా గరిష్ఠంగా రూ.400 ఉండేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరారు. దేశంలోని ఒక్కోచోట ఒక్కోలా ధరలు ఉన్నాయని, పలు రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఈ పరీక్ష కోసం రూ.900 నుంచి 2800 వరకు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

కరోనాతో నెలకొన్న విపత్తును అవకాశంగా వాడుకొని ప్రైవేటు ల్యాబోరేటరీలు, ఆస్పత్రుల యాజమాన్యాలు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాయని ఆరోపిస్తూ అజయ్‌ అగర్వాల్‌ అనే న్యాయవాది పిల్‌ దాఖలు చేశారు. లాభాల మార్జిన్‌ ఏపీలో 1400 శాతం ఉండగా.. దిల్లీలో 1200 శాతంగా ఉన్నట్టు పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లలో ప్రస్తుతం ఆర్​టీ-పీసీఆర్‌ కిట్లు రూ.200 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ అంశం దేశంలోని 135 కోట్ల మందికి సంబంధించినదని, కరోనా వైరస్‌తో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నట్టు పిల్‌లో పేర్కొన్నారు. అధిక ధరలు చెల్లించి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:'కొవిడ్- ఫ్లూ : రెండింటికీ ఒకే టెస్ట్'

ABOUT THE AUTHOR

...view details