తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రిపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య - విక్టోరియా అసుపత్రి

కరోనాతో బాధపడుతున్న వ్యక్తి ఆస్పత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. తనకు ఉన్న అనారోగ్య సమస్యల వల్ల అతడు బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Coronavirus patient commits suicide in Karnataka
కర్ణాటకలో కరోనా బాధితుడు ఆత్మహత్య

By

Published : Apr 27, 2020, 1:16 PM IST

కర్ణాటకలో కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని విక్టోరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న అతడు.. ఆస్పత్రి ఐదో అంతస్థు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

గత శుక్రవారం శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అతడు ఆస్పత్రిలో చేరగా.. కరోనా సోకినట్టు నిర్ధరణ అయ్యింది. అలాగే అతడు మూత్రపిండాల సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. తనకున్న అనారోగ్య సమస్యల వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:కోపంతో నిద్రపోవడం అంత మంచిది కాదు!

ABOUT THE AUTHOR

...view details