తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో కరోనా కేసులు@114.. ఒడిశాకు పాకిన వైరస్​

దేశంలో ప్రాణాంతక కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 114 కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఈశాన్య రాష్ట్రం ఒడిశాకూ వైరస్​ పాకింది. లద్దాఖ్​, జమ్ము కశ్మీర్​, కేరళలో ఒక్కో కేసు వెలుగులోకి వచ్చాయి. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. జనావాస ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడటంపై నిషేధం విధించాయి.

Coronavirus: Odisha reports first COVID-19 patient,  four fresh cases in Maharashtra
కొవిడ్​-19 కేసులు@114.. ఒడిశాకు పాకిన వైరస్​

By

Published : Mar 16, 2020, 6:03 PM IST

కరోనా దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఈశాన్య రాష్ట్రం ఒడిశాలో కొత్తగా ఒకరికి వైరస్​ సోకింది. దీంతో కేసుల సంఖ్య 114కు చేరింది. లద్దాఖ్​, జమ్ము కశ్మీర్​, కేరళలోనూ ఇవాళ ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మరో నలుగురికి వైరస్​ సోకింది.

114 మంది కేసుల్లో 17 మంది విదేశీయులు. మరో 13 మందికి వైరస్ తీవ్రత తగ్గగా.. డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు రెండు మరణాలు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 కోరలు చాస్తుంది. డబ్ల్యూహెచ్​ఓ లెక్కల ప్రకారం.. వైరస్​ 135 దేశాల్లో విస్తరించింది. 5700 మందికిపైగా వైరస్​కు బలయ్యారు. మరో లక్షా 53 వేల 517 మంది వైరస్​ బారిన పడ్డారు.

మహారాష్ట్రలో...

దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్​ సోకిన నలుగురు బాధితులతో కలిపి మొత్తం 37 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. కేరళలో మొత్తం కేసులు 21కి చేరాయి.

ఒడిశాలో..

ఒడిశాలో ఓ వ్యక్తికి వైరస్​ సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బాధితుడు ఇటలీ నుంచి మార్చి 6న స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 13న తలనొప్పి, జ్వరం లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను నిర్బంధంలో ఉంచి.. నిశితంగా పరిశీలిస్తున్నారు.

కరోనా వైరస్​ అంతకంతకూ విస్తరిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. జిమ్​లు, సినిమా హాళ్లు, ఈత కొలనులు, ఇతర జనావాస ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

హస్తినలో...

దిల్లీలో సాంస్కృతిక, రాజకీయ, సామాజిక కార్యక్రమాలపైనా ఆంక్షలు విధించారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. 50 మందికన్నా ఎక్కువగా ప్రజలు గుమిగూడటంపై నిషేధం అమల్లో ఉందని, మార్చి 31 వరకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు సీఎం.

ABOUT THE AUTHOR

...view details