తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 522 మందికి కరోనా - కరోనా తాజా వార్తలు

దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ 552 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు ఆ రాష్ట్రాధికారులు ప్రకటించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,590కి చేరింది. వైరస్ కట్టడికి ఎంతో కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా మహమ్మారి వల్ల చనిపోతే వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని రాజస్థాన్​ ప్రభుత్వం నిర్ణయించింది.

Coronavirus: Maha reports 522 more cases, tally 8,590
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 522 మందికి కరోనా

By

Published : Apr 27, 2020, 10:06 PM IST

దేశంలో కరోనా వైరస్​ వ్యాప్తి నానాటికి విస్తృతమవుతోంది. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28,380 మందికి వైరస్​ సోకింది. మృతుల సంఖ్య 886 మందికి చేరింది. 6,362 మంది కోలుకున్నారు.

మహారాష్ట్రలో ఒక్కరోజే 522 కేసులు..

దేశంలో కరోనా వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 522 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. వీటిలో 395 మంది ముంబయికి చెందినవారే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,590కి చేరింది. తాజాగా మరో 27 మంది చనిపోగా.. 369 మంది మృత్యువాత పడ్డారు.

అహ్మదాబాద్​లో అత్యధిక మరణాల రేటు..

గుజరాత్​లోనూ రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 247 కేసులు నమోదయ్యాయి. వీటిలో 197 కేసులు అహ్మదాబాద్​లోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కంటే అహ్మదాబాద్​లో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్​ వ్యాప్తంగా 3,548 మంది వైరస్​ బారిన పడగా.. 162 మంది మృతి చెందారు.

కర్ణాటకలో 512కు చేరిన కేసులు..

కర్ణాటకలో ఇవాళ ఓ వ్యక్తి మరణించగా.. ఇప్పటి వరకు మొత్తం 20 మంది మరణించారు. అంతే కాకుండా రాష్ట్రంలో 512 మందికి వైరస్​ సోకినట్లు తెలిపారు.

కేరళలో తాజాగా మరో 13 కేసులు..

కేరళలో సోమవారం మరో 13 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం 481 మంది వైరస్​ బారిన పడినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు.

పారిశుద్ధ్య కార్మికులకు 50 లక్షల పరిహారం..

కరోనా కారణంగా పారిశుద్ధ్య కార్మికుల్లో ఎవరైనా చనిపోతే వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని రాజస్థాన్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,185 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. 41 మంది మృతి చెందగా.. వైరస్​ బారిన పడి 518 మంది కోలుకున్నారు.

తమిళనాడులో

తమిళనాడులో కొత్తగా మరో 52 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. అందులో చెన్నైలోనే 47 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1937కు చేరింది. ఇప్పటి వరకు 24 మందిని మహమ్మారి బలి తీసుకోగా 1,100 మంది డిశ్చార్జ్​ అయ్యారు.

ఉత్తరప్రదేశ్​లో మరో 82 కేసులు...

ఉత్తరప్రదేశ్​లో సోమవారం 82 కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. దీంతో మొత్తం 1,955 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 31 మంది మృతి చెందగా.. 335 మంది కోలుకున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా...

దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 2,918 చేరగా.. 877 మంది కోలుకున్నారు. మరో 54 మంది మరణించారు. మధ్యప్రదేశ్​లో​ 2,168 మందికి వైరస్​ సోకగా 106 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్​లో 51 మంది బాధితులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details