కరోనా నివారణ చర్యగా కేంద్రం తీసుకొచ్చిన లాక్డౌన్ నిబంధనను మొదటినుంచీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. రాత్రి, పగలూ తేడా లేకుండా విధులకు అంకితమయ్యారు. అయితే.. ఈ సమయంలో తన 14 నెలల పాపతో కలిసి విధులు నిర్వర్తిస్తోంది గుజరాత్ కచ్‌లోని ఓ మహిళా కానిస్టేబుల్.
ప్రస్తుత లాక్డౌన్ సమయంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ.. భౌతిక దూరం ప్రాధాన్యాన్ని వివరిస్తోంది అల్కాబెన్ దేశాయ్. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని, తన బాధ్యత తాను చేస్తున్నట్లు చెప్పింది.
'' నా భర్త విధుల్లో ఉన్నారు. పాపను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు. అందుకే నాతో పాటే తీసుకొస్తున్నాను.''
-అల్కాబెన్ దేశాయ్, పోలీసు కానిస్టేబుల్