కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో లాక్‌డౌన్ ముగిసిన వెంటనే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వీలుగా భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నౌకాదళ ఓడలు, సైనిక, వాణిజ్య విమానాలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కోర్ కమిటీకి.. తమ వద్ద ఉన్న 650 విమానాల్లో అధిక భాగం సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పౌర విమానయాన శాఖ సమాచారం ఇచ్చింది. భారతీయులను స్వదేశానికి తీసుకువస్తే వారి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.