కరోనా వైరస్‌పై అధ్యయనం కోసం నేషనల్ టాస్క్‌ఫోర్స్ అయిదు పరిశోధన బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందాల సభ్యులు తమకు అప్పగించిన అంశాలపై నిరంతరం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకుంటూ రీసెర్చి ప్రొటోకాల్స్ రూపొందించడంతో పాటు, ఇందులో దేశంలోని ఏయే సంస్థలను భాగస్వాములు చేయాలన్నది గుర్తించాలి.
1. క్లినికల్ రీసెర్చి గ్రూప్: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 9 మంది సభ్యులు ఉంటారు.
విధివిధానాలు: పరిశోధన ప్రాధాన్యాలను గుర్తించడం. ఆధారాలను పరిశీలించడం, ప్రొటోకాల్స్‌ని రూపొందించి వాటి అమలుకు అనువైన సంస్థలను గుర్తించడం.
2. రీసెర్చ్ ఆన్ డయాగ్నాస్టిక్స్ అండ్ బయోమార్కర్స్:ఛైర్మన్‌గా డీఏ గడ్కరీతో పాటు 9 మంది సభ్యుల నియామకం.
విధివిధానాలు: పరిశోధన ప్రాధాన్యాలను గుర్తించడం. టెస్టింగ్ వ్యూహాలపై ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలివ్వడం.