కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 31వరకు విద్యాసంస్థలు మూసివేశారు. ఈ కారణంగా పిల్లలు.. చదువులకు దూరమవుతున్నారని భావించిన మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ ఆన్లైన్ తరగతులు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. స్వయం ప్రభ డీటీహెచ్ ఛానెల్లో ఆన్లైన్ తరగతులు అందుబాటులో ఉంటాయని ట్విట్టర్లో వెల్లడించారు.
"విద్యార్థులారా, మీ పాఠశాలలు మూసివేసినప్పటికీ చదువును వదిలిపెట్టకండి. మీ కోసం త్వరలోనే మేం స్వయం ప్రభా డీటీహెచ్ ఛానెళ్లలో ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నాం. మీ పాఠశాల సిలబస్‌తో కూడిన తరగతులను అందుబాటులో ఉంచుతాం. నాలుగు గంటల పాటు తరగతులు ప్రచారం చేయడానికి స్వయం ప్రభా ఛానెల్‌తో అంగీకారం కుదుర్చుకున్నాం. కరోనా కారణంగా విద్యార్థులు పాఠశాలకు హాజరు కాలేకపోతున్నారు. ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా చదువు కోసం కేటాయించండి.''