తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విదేశాల్లోని విద్యార్థులపై కేంద్రం స్పందించాలి' - కేంద్ర ప్రభుత్వం

కరోనా ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని దిల్లీ హైకోర్టు కోరింది. విదేశాల్లోని విద్యార్థులను తీసుకొచ్చేందుకు కేంద్రం అనుమతివ్వకపోవడంపై కోర్టులో పిటిషన్​ దాఖలు కాగా.. ధర్మాసనం విచారణకు అంగీకరించింది.

Coronavirus: HC seeks response of Centre, DGCA on ban on passenger travel from EU, UK
'విదేశాల్లోని విద్యార్థులపై కేంద్రం స్పందించాలి'

By

Published : Mar 20, 2020, 5:28 PM IST

కరోనా ​వ్యాప్తిని అరికట్టేందుకు పలు స్వేచ్ఛ వాణిజ్య సభ్య దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలవగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. ఈ మేరకు జస్టిస్​ జేఆర్​ మిధాతో కూడిన ధర్మాసనం కేంద్ర ఆరోగ్య, గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్ ఏవియేషన్స్​కు నోటీసులు జారీ చేసింది.

కొవిడ్​-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈనెల 18 నుంచి యూరోపియన్​ యూనియన్​, యూకే, టర్కీ, ​స్వేచ్ఛ వాణిజ్య సంఘం సభ్య దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఓ సర్క్యులర్​ను తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా స్కాట్లాండ్​లో చదువుతున్న భారత విద్యార్థి తండ్రి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు అంగీకరించిన దిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.

ఇదీ చదవండి:206కు చేరిన కరోనా కేసులు- వాట్సాప్​ నంబర్​ విడుదల

ABOUT THE AUTHOR

...view details