లాక్డౌన్ పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం చర్చించింది. లాక్డౌన్ పొడిగింపు, ఏప్రిల్ 20 నుంచి దేశంలోని హాట్‌స్పాట్ యేతర జోన్లలో పాక్షికంగా అనుతించే ఆర్థిక కార్యకాలపాలపై సమీక్షించింది.
రాజ్‌నాథ్ నివాసంలో భేటీ అయిన కేంద్ర మంత్రులు.. సడలింపులపై స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు పలు మంత్రిత్వ శాఖల నుంచి సమాచారం తీసుకున్నారు.
"కరోనా పరిస్థితులపై మంత్రుల బృందంతో చర్చించాను. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు మంత్రిత్వశాఖలు ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశంపై సమాలోచనలు చేశాం. పరిమిత కార్యకలాపాలకు అనుమతిస్తూ ఆర్బీఐ ప్రకటించిన చర్యలు ప్రశంసనీయం."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
వైద్య సేవలపై..
విశ్రాంత వైద్యులు, నిపుణులు, గ్రాడ్యుయేషన్ చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థుల సేవలు ఉపయోగించుకునే విషయంలో వచ్చిన పలు సూచనలపై మంత్రుల బృందం చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రజలకు విజ్ఞప్తి..
భౌతిక దూరం పాటించే విషయంలో ఇచ్చిన నిబంధనలు పాటించాలని, ప్రార్థనలు, కార్యక్రమాలకు వెళ్లవద్దని ప్రజలకు సూచించింది మంత్రుల బృందం. ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి చేయూత ఇవ్వడం, ఇంట్లోనే మాస్క్‌లు తయారు చేసుకోవడం వంటి ప్రధాని సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్‌విలాస్ పాసవాన్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జావడేకర్, రమేశ్ పొఖ్రియాల్, స్మృతి ఇరానీ, జయశంకర్, గజేంద్ర సింగ్ శెఖావత్, హర్దీప్ సింగ్ పూరీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రైతులను ఆదుకునేందుకు కేంద్రానికి స్వామినాథన్ సూచనలు