దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తమిళనాడులో కొత్తగా 5,776 మందికి వైరస్ సోకగా.. 89మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,69,256కి చేరింది. మృతుల సంఖ్య 7,925కు పెరిగింది. అయితే వరుసగా రెండోరోజు కేసుల కంటే రికవరీలే(5,930) అధికంగా ఉండటం గమనార్హం.
కర్ణాటకలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా 5,773 కేసులు వెలుగుచూశాయి. మరో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,04,324మందికి వైరస్ సోకింది. 6,534మంది వైరస్ ధాటికి మరణించారు.
5 వేలపైనే...
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 5,649 కేసులు నమోదయ్యాయి. మరో 56 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 71 వేలు దాటింది.
- ఒడిశాలో తాజాగా 3,861 మంది కరోనా బారిన పడగా.. మరో 10 మంది వైరస్‌కు బలయ్యారు. ఆ రాష్ట్ర పర్యటక మంత్రి జేపీ పాణిగ్రహీకి కరోనా పాజిటివ్‌గా తేలింది.
- పంజాబ్, హరియాణాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఇవాళ ఒక్కరోజే 2 వేలకు పైనే కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో 61మంది, హరియాణాలో 23 మంది మరణించారు.
- దిల్లీలో ఒక్కరోజే 2,077 కేసులు నమోదవగా... 32 మంది చనిపోయారు.
- మధ్యప్రదేశ్‌లో 1,885 కేసులు బయటపడగా.. మరో 17మంది కొవిడ్‌కు బలయ్యారు.
- జమ్ముకశ్మీర్‌లో తాజాగా 1,013 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 17 మంది మృతిచెందారు.