దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 90వేలకు పైనే నమోదవుతున్నాయి. కొత్తగా 92,071 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,136 మంది కొవిడ్‌కు బలయ్యారు.
కరోనా పంజా: కొత్తగా 92,071 కేసులు, 1136 మరణాలు - భారత్‌లో కరోనా మరణాలు
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా 92,071 మందికి వైరస్ సోకింది. మరో 1,136 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం కేసులు సంఖ్య 48 లక్షల 46 వేలు దాటింది.
![కరోనా పంజా: కొత్తగా 92,071 కేసులు, 1136 మరణాలు Coronavirus fresh cases and death toll in India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8791677-thumbnail-3x2-covid-19.jpg)
దేశంలో 48 లక్షలు దాటిన కరోనా కేసులు
మరణాలు రేటు క్రమంగా తగ్గుతూ 1.64 శాతానికి చేరింది. రికవరీ రేటు కూడా 78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. సరైన సమయంలో రోగులను గుర్తించి, మెరుగైన చికిత్స అందించడం వల్లే ఈ మేరకు సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:విశ్వసనీయ వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు!
Last Updated : Sep 14, 2020, 10:16 AM IST