తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా దెబ్బకు ఘాటు తగ్గిన కర్ణాటక మిర్చి - karnataka virus

కర్ణాటకలో మిర్చి వ్యాపారంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్​ నుంచి చైనాకు మిరప ఎగుమతులు ఆగిపోవడం వల్ల డిమాండ్​ పూర్తిగా పడిపోయింది. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Coronavirus effected on Byadagi red chili
కరోనా దెబ్బకు ఘాటు తగ్గిన కర్ణాటక మిర్చి

By

Published : Feb 8, 2020, 12:28 PM IST

Updated : Feb 29, 2020, 3:11 PM IST

కరోనా వైరస్​ ప్రభావం ప్రజలపైనే కాదు వ్యాపారాలపైనా పడింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కరోనా దెబ్బకు మిర్చి వ్యాపారంభారీగా పడిపోయింది.

భారత్ ​నుంచి చైనా దిగుమతి చేసుకొనే ప్రధాన ఉత్పత్తుల్లో మిర్చి కూడా ఒకటి. ప్రస్తుతం కరోనా వైరస్​ వల్ల ఇరుదేశాల మధ్య ఈ వ్యాపార లావాదేవీలు పూర్తిగా ఆగిపోయాయి. ఫలితంగా మిర్చిని ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఎగుమతి నిలుపుదలకు ముందు ఒక్కో క్వింటాల్​ ధర రూ. 17 వేల నుంచి 20 వేల వరకు ఉండేది. కానీ కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం రూ. 10 వేల నుంచి 12 వేలకు పడిపోయింది.

ఒకటి మరువకముందే మరొకటి

బళ్లారి తాలుకాలో సుమారు 70 హెక్టార్లలో మిర్చిని సాగు చేశారు. జిల్లాలోని కంప్లి పట్టణంలో 6 వేల హెక్టార్లకు పైగా మిర్చి పంటపై అక్కడి రైతులు ఆధారపడుతుంటారు. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం వల్ల మిరప దిగుబడి పడిపోయింది. మరోవైపు కరోనా వైరస్​ ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: చైనా, మయన్మార్​ ఉత్పత్తులపై నిషేధం

Last Updated : Feb 29, 2020, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details