తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శానిటైజేషన్​కు డీఆర్​డీఓ కొత్త టెక్నిక్​లు - కరోనా లేటెస్ట్ న్యూస్

కరోనా వైరస్​ కారణంగా ఇటీవలే అన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్​పై దృష్టి సారించారు అధికారులు. ఈ నేపథ్యంలో శానిటైజేషన్​ ప్రక్రియను వేగంగా, సులభంగా నిర్వహించేందుకు కొత్త పరికరాలను రూపొందించింది డీఆర్​డీఓ. ప్రస్తుతం దిల్లీ పోలీసులకు అందుబాటులో ఉన్న ఈ పరికరాలను త్వరలోనే అన్ని ప్రాంతాలకు అందిస్తామని డీఆర్​డీఓ తెలిపింది.

DRDO develops techniques for sanitisation
శానిటైజేషన్​కు డీఆర్​డీఓ సాంకేతికత

By

Published : Apr 4, 2020, 7:12 AM IST

కరోనా వైరస్​పై పోరుకు భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ 'డీఆర్​డీఓ' చర్యలు ముమ్మరం చేసింది. ఆసుపత్రులు, కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో.. శానిటైజైషన్​ నిర్వహణకు సాంకేతిక పరికరాలను తయారు చేసింది.

దిల్లీ సెంటర్​ఫర్​ ఫైర్​ ఎక్స్​ప్లోజివ్, ఎన్విరాన్​మెంట్ సేఫ్టీ (సీఎఫ్​ఈఈఎస్​).. రెండు పద్ధతులను రూపొందించింది.

బ్యాక్​ ప్యాక్​ ఏరియా శానిటైజేషన్​..

రెండు సాంకేతికతల్లో ఒకటి బ్యాక్​ ప్యాక్​ ఏరియా శానిటైజేషన్​ ఎక్విప్​మెంట్​​​. వైరస్​ అనుమానిత ప్రాంతాలను(ఇళ్లు, చిన్న చిన్న ప్రాంతాల వంటివి) శానిటైజ్​ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఒక శాతం హైడ్రోక్లోరైడ్​తో కూడిన ద్రవాన్ని శానిటైజేషన్​ కోసం వినియోగిస్తారు.

ఈ వ్యవస్థను శానిటైజ్​ చేసే వ్యక్తి సులభంగా ఉపయోగించేందుకు వీలుంది. దీని ద్వారా దాదాపు 300 చదరపు మీటర్ల స్థలాన్ని శానిటైజ్​ చేయొచ్చని డీఆర్​డీఓ తెలిపింది. ఆస్పత్రుల్లోని రిసెప్షన్లు, డాక్టర్​ ఛాంబర్​లు, కార్యాలయాల లోపల శానిటైజ్​ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ట్రాలీ మౌంటెడ్​ శానిటైజేషన్​..

రెండోది ట్రాలీ మౌంటెడ్​ శానిటైజేషన్ వ్యవస్థ. దీని ద్వారా 3,000 చదరపు మీటర్ల ప్రాంతాన్ని శానిటైజ్​ చేసేందుకు వీలుంటుంది. 50 లీటర్ల సామర్థ్యమున్న ట్యాంక్​తో ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది డీఆర్​డీఓ. దీని ద్వారా 12 నుంచి 15 మీటర్ల దూరం వరకు శానిటైజేషన్ ద్రవాన్ని పిచికారి చేయొచ్చు. ఆస్పత్రులు, మాల్స్, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, ఐసోలేషన్​, క్వారంటైన్ సెంటర్లు సహా వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో శానిటైజేషన్​కు ఇది ఉపయోగపడనుంది.

ఈ వ్యవస్థలు తక్షణమే దిల్లీ పోలీసులకు సమకూర్చారు. ఇతర ప్రాంతాల్లోను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు డీఆర్​డీఓ తెలిపింది.

పోరుకు ఆర్మీ సిద్ధం

కరోనా సోకిన వారికి వైద్యం అందించేందుకు భారత ఆర్మీ సిద్ధమవుతోంది. ఇందుకోసం 51 ఆస్పత్రులను సిద్ధం చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

కొవిడ్​ 19 నిర్ధరణ పరీక్షలు చేయగల సామర్థ్యమున్న ఐదు ల్యాబ్​లను సిద్ధం చేసినట్లు పేర్కొంది.

ఇందులో దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి(రీసెర్చ్​ అండ్​ రిఫరల్​), బెంగళూరులోని ఎయిర్​ఫోర్స్​ కమాండెడ్ ఆస్పత్రి, పుణెలోని ఆర్మీ వైద్య కళాశాల, లఖ్​నవూ, ఉందాపూర్​లలోని కామాండెడ్​ ఆస్పత్రులు ఉన్నాయి.

మరో ఆరు ఆస్పత్రులను కరోనా పరిక్షలకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'జమాత్​' బాస్​పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!

ABOUT THE AUTHOR

...view details