దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రోజు వారి కరోనా కేసుల సూచీ భయపెడుతోందన్నారు.
దేశంలో కేసులు 23 లక్షలు దాటిన నేపథ్యంలో ఈ మేరకు విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు రాహుల్. అమెరికా, బ్రెజిల్, భారత్‌లో కరోనా కేసుల రేఖా చిత్రాన్ని తన ట్వీట్‌కు జత చేశారు.
"కరోనా సూచీ... భయపెడుతోంది.. కానీ తగ్గటం లేదు. "
- రాహుల్ గాంధీ.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్. కరోనా పెరుగుతున్నా ప్రధానికి స్థిరమైన పరిస్థితి అయితే.. కేసులు తగ్గుతున్న దేశాల్లో పరిస్థితులను ఏమనాలి అంటూ ప్రశ్నించారు.