భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒక్కరోజే 53,601 కేసులు వెలుగుచూశాయి. అయితే గత నాలుగు రోజులుగా నమోదైన కేసులతో పోల్చి చూస్తే ఇవాళ కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నాయి. మరో 871 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 22 లక్షల 68 వేలు దాటింది.
దేశంలో ఒక్కరోజే 53 వేల కేసులు.. 871 మంది మృతి - Covid-19 death toll in India
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లో 60 వేల చొప్పున నమోదైన కేసులు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 53,601 మందికి వైరస్ సోకింది. మరో 871 మంది మృతి చెందారు.

తగ్గిన కరోనా కేసులు.. 47వేల మందికి వైరస్
దేశంలో కొవిడ్ బాధితులు పెరుగుతున్నప్పటికీ... కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 69.80 శాతం ఉండగా... మరణాల రేటు 1.99 శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల సంఖ్య 28.21శాతానికే పరిమితమవ్వడం ఊరట కలిగిస్తోంది.
ఇదీ చూడండి:వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
Last Updated : Aug 11, 2020, 10:04 AM IST