నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ వ్యవహారం దిల్లీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగేందుకు కారణమైంది. ఒక్క రోజులోనే 141 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఫలితంగా దిల్లీలో మొత్తం బాధితుల సంఖ్య 293కు, మృతుల సంఖ్య 4కు చేరింది.
152 నుంచి 293కు...
బుధవారం రాత్రి వరకు దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 152 మాత్రమే. అయితే ఒక్క రోజులోనే కొత్తగా 141 కేసులు నమోదయ్యాయి. ఇందులో 129 మంది మర్కజ్ వ్యవహారంతో సంబంధమున్నవారే.